దూసుకెళ్తున్న 'రావణాసుర' టీజర్.. 24 గంటల్లోనే అన్ని మిలియన్ క్రాస్!

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ రావణాసుర..

ధమాకా సినిమాతో తనలోని ఎనర్జీని మరోసారి బయటకు తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రవితేజ.మరి ఆ వెంటనే వాల్తేరు వీరయ్యలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఫ్యాన్స్ కు మరో మాస్ అండ్ పవర్ ఫుల్ ట్రీట్ అందించి మరో హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రావణాసుర సినిమాతో మరో డిఫరెంట్ రోల్ లో తనను తాను ప్రెజెంట్ చేసుకోబోతున్నాడు.డిఫెరెంట్ షేడ్స్ తో ఆకట్టు కోవడానికి రవితేజ అండ్ టీమ్ సిద్ధం అవుతుంది.

ఇప్పటికే రావణాసుర సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.ఇక ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది.

Advertisement

ఈ టీజర్ రవితేజ సినిమాల్లోనే భిన్నంగా అనిపిస్తూ అందరిని ఆకట్టు కుంటుంది.

నిన్న సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.ఈ టీజర్ లో రవితేజను ఒక పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్ గా చూపించి ఆకట్టు కునేలా తన రోల్ ను సుధీర్ వర్మ తీర్చిదిద్దాడు.టీజర్ టోన్ పలువురి ప్రశంసలు అందుకున్న రవితేజ 24 గంటల్లోనే ఏకంగా 3 మిలియన్స్ కు పైగానే వ్యూస్ ను రాబట్టి టాప్ లో ట్రెండ్ అవుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.

అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రావణాసుర సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి కలుగుతుంది.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement
https://youtu.be/6DcPh88Wwsg

తాజా వార్తలు