SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన హోమ్ లోన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగియనుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది.ఈ ఆఫర్‌లో భాగంగా SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లను బాగా తగ్గించిన సంగతి కూడా మీకు తెలుసు.
అయితే ఈ ఆఫర్ 2023 జనవరి 31 వరకే అందుబాటులో ఉంటుందని మర్చిపోవద్దు.కస్టమర్లు తక్కువ వడ్డీకే రుణాలు పొందడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఆఫర్‌లో భాగంగా గృహ రుణాల వడ్డీ రేటుపై 30 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గింపు ప్రకటించింది SBI.అంటే సాధారణ హోమ్ లోన్ వడ్డీ రేట్ల కన్నా ఈ ఆఫర్‌లో వడ్డీ రేట్లు బాగా తక్కువగా ఉంటాయి.

ఇటీవల SBI MCLRను 10 బేసిస్ పాయింట్స్ మేర పెంచగా జనవరి 15 నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది.రెండేళ్ల MCLR 8.50 శాతం, మూడేళ్ల MCLR 8.60 శాతంగా ఉండగా ఒక నెల, 3 నెలల MCLR 8 శాతంగా ఉంది.హోమ్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడీకే రుణాలు వస్తాయని గుర్తించండి.సిబిల్ స్కోర్ 800 పైన ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.90 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గుతుంది.ఇక సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే వడ్డీ రేటు 9.10 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గుతుంది.ఇక ఇపుడు కింది స్టెప్స్ ఉపయోగించి SBI హోమ్ లోన్‌కు అప్లై చేయడానికి యోనో ఎస్‌బీఐ యాప్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.
1.మొదటగా మీ యోనో SBI యాప్ ను ఓపెన్ చేయాలి.

2.తరువాత టాప్ లెఫ్ట్ కార్నర్‌లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.
3.ఆ తరువాత లోన్స్ సెక్షన్‌లోకి వెళ్లి, హోమ్ లోన్ పైన క్లిక్ చేయాలి.

4.తరువాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
5.ఇపుడు ఆదాయ మార్గాల వివరాలు తెలపాలి.
6.తదుపరి నెలవారీ ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి.
7.తరువాత అడిగిన ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
8.అవన్నీ చేసిన తరువాత మీకు ఎంత వరకు లోన్ వస్తుందో వివరాలు తెలుస్తాయి.
9.ఇపుడు మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఇక ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీకు SBI ఎగ్జిక్యూటీవ్ నుంచి కాల్ వస్తుంది.ఆ తరువాత వారు మిగతా లోన్ ప్రాసెస్ మీకు వివరిస్తారు.







