ఒకే ఒక్క పాట తో థియేటర్లకు క్యూ కట్టెల చేసిన సినిమాలు

సినిమా విజ‌యం సాధించాలంటే.అన్ని ఫ‌ర్ఫెక్ట్ గా ఉండాలి.

స్టోరీ, స్క్రీన్ ప్లే, టేకింగ్, యాక్ష‌న్ సీన్స్, పాట‌లు, కామెడీ.

అన్నీ కుద‌రాలి.

లేదంటే సినిమా చెత్త‌బుట్ట‌లోకి పోవ‌డం ఖాయం.అయితే కొన్ని సినిమాల్లో పాట‌లు అద్భుతంగా ఉంటాయి.

సినిమా జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచిపోతాయి.కేవ‌లం ఆ పాట‌ల కోస‌మే సినిమాల‌కు జ‌నాలు వెళ్లారంటే ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

Advertisement

అలాంటి వాటిలో కొన్ని పాట‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నేను మీకు తెలుసా?- ఎన్నో ఎన్నో ఎన్నెన్నోమ‌నోజ్, స్నేహ ఉల్లాల్ జంట‌గా న‌టించిన

RX-100- పిల్లా రా

ఈ పాట జ‌నాల్లోకి విప‌రీతంగా వెళ్లింది.RX-100 సినిమా విజ‌యానికి ఈ పాట ఎంతో ఉప‌యోగ‌ప‌డింది.ఈ పాట వ‌ల్ల ఎంతో మంది యువ‌కులు సినిమా థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.

హీరో, హీరోయిన్ల‌తో పాటు డైరెక్ట‌ర్ కు మంచి పేరు తెచ్చింది.ర‌ణం- బుల్లిగౌను వేసుకునిగోపీ చంద్, కామ్నా జెఠ్మ‌లానీ జంట‌గా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఈ పాట‌లో అమ్మాయిల‌తో అలీ ప‌డ్డ ఇబ్బందుల‌ను గోపీ చంద్ కు చెప్తాడు.జనాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది ఈ పాట‌కు.

Advertisement

ఐతే- చిట‌ప‌ట చినుకులు

క‌ల్యాణ్ మాలిక్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన సినిమా ఐతే.ఈ సినిమాలో చిట‌ప‌ట చినుకులు అనే పాట సూప‌ర్ హిట్ అయ్యింది.ప్రేక్ష‌కుల రింగ్ టోన్ గా మారిపోయింది.గోపి గోపిక గోదావ‌రి- నువ్వ‌క్క‌డుంటే

వంశీ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.వేణు, క‌మ‌లిని ముఖ‌ర్జీ న‌టించిన ఈ మూవీలోని నువ్విక్కడుంటే నేనక్కడుంటే ప్రాణం విల విల పాట ఓ రేంజిలో హిట్ అయ్యింది.ఈ పాట కోసం సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్ బారులు తీరారు.

సెగ‌-వ‌ర్షం ముందుగావెప్పం సినిమా తెలుగులోకి సెగ‌గా వ‌చ్చింది.నాని, నిత్యా మీన‌న్ క‌లిసి న‌టించారు.

ఈ మూవీ మామూలుగానే ఆడినా వ‌ర్షం ముందుగా మ‌బ్బుల ఘ‌ర్ష‌ణ అనే పాట బాగా పాపుల‌ర్ అయ్యింది.కౌస‌ల్య కృష్ణ‌మూర్తి- ముద్ద‌బంతి పువ్వు ఇలా పైట వేసెనేనిరుపేద అమ్మాయి టీమిండియా క్రికెట‌ర్ గా ఎదిగేందుకు ప‌డిన క‌ష్టం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన ఈ సినిమాలోని ముద్ద‌బంతి పువ్వు ఇలా పైట వేసెనే అనే పాట బాగా పాపుల‌ర్ అయ్యింది.గుణ‌ 369- నా బంగారం బుజ్జి

కార్తికేయ హీరోగా వ‌చ్చిన సినిమా గుణ 369ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడినా అందులోని నా బుజ్జి బంగారం అనే పాట ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.నా ఆటోగ్రాఫ్- మౌనంగానే ఎద‌గ‌మ‌నిర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ సినిమాలోని అన్ని పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి.ఇందులో భూమికపై తెర‌కెక్కించిన పాట మౌనంగానే ఎద‌గ‌మ‌ని.

పాట ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లోకి వెళ్లింది.మంచి మెసేజ్ ఉన్న ఈ పాట అంద‌రికీ జీవితాంతం గుర్తుండి పోయేలా చేసింది.

పైసా-నీతో ఏదో చెప్పాల‌ని

నాని, కేథ‌రిన్ క‌లిసి న‌టించిన ఈ సినిమాలోని పాట చ‌క్క‌టి ప్ర‌జాద‌ర‌ణ పొందింది.సినిమాతో త‌ల‌నొప్పి తెచ్చుకున్న ప్రేక్ష‌కుల‌కు ఈ పాట కాస్త ఊర‌ట నిస్తుంది.శ్రీ‌రామ్- తియ‌తియ‌ని క‌ల‌ల‌ను క‌న‌డ‌మేఉద‌య్ కిర‌ణ్, అనిత న‌టించిన ఈ సినిమా శ్రీ‌రామ్.

ఇందులోని రొమాంటిక్ సాంగ్ తియ‌తియ‌ని క‌ల‌ల‌ను క‌న‌డ‌మే.ఈ పాట కోసం ప్రేమ జంట‌లు థియేట‌ర్ల‌కు క‌ద‌లి వ‌చ్చేవి.

రాజు భాయ్- ఎవ్వ‌రు నువ్వు మ‌నోజ్ కెరీరం లో బిగ్గెస్ట్ హిట్ రాజు భాయ్ మూవీ.అందులోని ఫేవ‌రెట్ సాంగ్ ఎవ్వ‌రు నువ్వు న‌న్ను క‌దిపావు.

ప్రేమికుల‌కు ఈ పాట ఆల్ టైమ్ ఫేవ‌రెట్ అని చెప్పుకోవ‌చ్చు.శజ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా- ఓ రంగుల చిలుక

సినిమా విడుద‌ల‌కు ముందే ఈ పాట జ‌నాల్లోకి విప‌రీతంగా వెళ్లింది.కేవ‌లం ఈ పాట కోస‌మే జ‌నాలు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.

తాజా వార్తలు