పొట్టలో ట్విన్స్ ఉంటే ఖ‌చ్చితంగా ఈ ఆహారం తీసుకోవాల్సిందే!

గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి స్త్రీకి ఒక గ‌ప్ప వ‌రం అన‌డంలో సందేహం లేదు.ఎందుకంటే.

త‌న నుంచి మ‌రో ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకొచ్చే శ‌క్తి కేవ‌లం స్త్రీల‌కు మాత్రమే ఉంటుంది.గర్భధారణ సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రాణాలు పోతున్నా.

బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నాను అనే ఆనందం ముందు అన్నీ చాలా చిన్న‌గా క‌నిపిస్తాయి.అందుకే పెళ్లైనా ప్ర‌తి మ‌హిళా ప్రెగ్నెంట్ అవ్వాల‌ని కోరుకుంటుంది.

అందు కోసం తెగ ఆరాట‌ప‌డుతుంటుంది.ఇక అలాంటి త‌రుణంలో గ‌ర్భం దాల్చితే వ‌చ్చే సంతోషం అంతా ఇంతా కాదు.

Advertisement
Super Foods Eat When You Are Pregnant With Twins! Super Foods, Pregnant, Twins,

అందులోనూ త‌న‌ క‌డుపులో ట్విన్స్ (క‌వ‌ల‌లు) ఉన్న‌ర‌నే విష‌యం తెలిస్తే.సంతోషం మ‌రింత రెట్టింపు అవుతుంది.

అయితే పొట్ట‌లో ట్విన్స్ ఉన్న‌ప్పుడు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.తీసుకునే ఆహారం త‌గ్గ‌ర నుంచి.

చేసే ప‌నులు, వేసుకునే బ‌ట్ట‌ల వ‌ర‌కు ఇలా ప్ర‌తి విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకోవాలి.ముఖ్యంగా క‌డుపులో ట్విన్స్ ఉప్ప‌ప్పుడు ఖ‌చ్చితంగా ప‌లు ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా కొంద‌రు చేపల‌ను ఇష్ట‌ప‌డ‌రు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చేప‌లు ఆరోగ్యానికి మంచిది అని తెలిసినా.కొంద‌రు వాటి జోలికే వెళ్ల‌రు.

Super Foods Eat When You Are Pregnant With Twins Super Foods, Pregnant, Twins,
Advertisement

కానీ, పొట్ట‌లో క‌వ‌ల‌లు ఉన్న వారు మాత్రం ఖ‌చ్చితంగా చేప‌ల‌ను వారానికి ఒక‌సారి అయినా తినాలి.ఎందుకంటే, చేప‌ల్లో ఉండే ఎన్నో పోష‌క విలువ‌ల‌.క‌డుపులోని శిశువుల ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో తోడ్ప‌తాయి.

సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా ఎదుర్కొంటారు.అయితే క‌డుపులో ట్విన్స్ ఉంటే.

ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.ఐర‌న్ లోపం కార‌ణంగా ర‌క్త‌హీన‌త ఏర్ప‌డుతుంది.

దాంతో పుట్టే పిల్ల‌లు బ‌ల‌హీనంగా పుడ‌తారు.అయితే అలా జ‌ర‌గ‌కుండా ఉండాలి అంటే.

కాబ‌ట్టి, ఆ స‌మ‌యంలో పాల‌కూర‌, బీట్‌రూట్‌, పుదీనా, డార్క్ చాక్లెట్, ఆలుగ‌డ్డ‌లు, తృణ‌ధాన్యాలు వంటివి తీసుకుంటే.ర‌క్త‌హీన‌త దూరంగా ఉంటుంది.

అలాగే కొంద‌రు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలోనూ గుడ్డు ఎవైడ్ చేస్తుంటారు.కానీ, క‌డుపులో ట్విన్స్ ఉంటే మాత్రం ప్ర‌తి రోజు గుడ్డు తీసుకోవాలి.

దీని ద్వారా విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ క‌డుపులో శిశువుల‌కు అందుతాయి.ఇక వీటితో పాటు పాలు, పెరుగు, ద్రాక్ష‌, జీడిప‌ప్పు, పిస్తా, క‌ర్జూరాలు, బాదం, వాల్న‌ట్స్‌, తాజా పండు మ‌రియు కూర‌గాలు కూడా తీసుకోవాలి.

అప్పుడు క‌వ‌ల‌లు ఆరోగ్యంగా ప‌డుతారు.

తాజా వార్తలు