మంచు లక్ష్మి( Manchu Lakshmi ) పరిచయం అవసరం లేని పేరు.ఈ మధ్యకాలంలో మంచు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.
మంచు మనోజ్( Manoj ) పెళ్లికారణంగా మంచు కుటుంబం గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలాగే విష్ణు ( Vishnu ) మనోజ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున మంచు ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి.పూర్తిగా అవగాహన లేదు అంటూ మంచు లక్ష్మి ఈ గొడవపై స్పందించారు.ఇకపోతే మంచు కుటుంబం సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సోషల్ మీడియాను గెలికి మరీ తిట్టించుకున్నారు.కేవలం ఈమె సన్నీలియోన్ ( Sunny Leone ) పేరు ప్రస్తావించినందుకుగాను పెద్ద ఎత్తున నెటిజన్స్ సోషల్ మీడియాలో లక్ష్మి మంచును ట్రోల్ చేస్తున్నారు.అసలు ఏం జరిగింది ఎందుకు ఈమెను ట్రోల్ చేస్తున్నారనే విషయానికి వస్తే… సోషల్ మీడియాలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.భారీ జన సందోహంతో ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఇది ఏ రాజకీయ నాయకుడు పెట్టిన సభ అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోపై మంచు లక్ష్మి కామెంట్ చేశారు.ఇలా ఈ ఫోటోకి ఈమె సమాధానం చెబుతూ సన్నీలియోన్ అని కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.రాజకీయ నాయకుడి పార్టీకి సంబంధించిన ఫోటోకి ఈమె సన్నీలియోన్ పేరు చెప్పడంతో అసలు నీకు రాజకీయాలు అవసరమా అంటూ నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.సన్నీలియోన్ ఇలా బయటకు వచ్చిన పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటారన్న ఉద్దేశంతో మంచు లక్ష్మి సన్నిలియోన్ అని కామెంట్ చేయడంతో నెటిజన్స్ మాత్రం ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు ఇలా గెలికి మరీ తిట్టించుకోవడం అవసరమా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు
.






