పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,( Prabhas ) కృతి సనన్( Kriti Sanon ) తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్.
విడుదల అయిన మొదటి రోజే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.అయితే మూవీ విడుదల అయిన తొలిరోజే దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.ఏ స్థాయిలో కలెక్షన్స్ను రాబట్టిందో అంతేస్థాయిలో విమర్శల పాలైంది.
రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతూనే ఉంది.ఇప్పటికే చాలామంది నెటిజన్స్ ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు గుర్తించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రామాయణం టీవీ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి( Sunil Lahri ) ఆదిపురుష్ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా సునీల్ లహరి మాట్లాడుతూ.
వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్‌క్లెయిమర్‌లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది.అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నాను.
ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.అందుకు భిన్నంగా తీశారు.
పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు.మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు.
డైలాగులు కూడా ఇందులో చాలా దారుణంగా ఉన్నాయి.ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు.దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది.
అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు.స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు.
ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి.హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు అని తెలిపారు.
అనంతరం సినిమాలోని పాత్రల గురించి ఆయన మాట్లాడుతూ.ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు.
అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు.సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి.
వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు.ఇది నటీనటుల తప్పు కాదు.
వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది.ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా.
ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది అని చెప్పుకొచ్చారు సునీల్ లహరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy