టాలీవుడ్ హీరో సందీప్ కిషన్( Hero Sundeep Kishan ) గురించి మనందరికీ తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సందీప్.
ఇకపోతే సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ). తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.వీఐ ఆనంద్( VI Anand ) దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు.ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్ లుగా నటించారు.

శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు.వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించారు.ఇకపోతే రెండు రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను( Ooru Peru Bhairavakona Collections )) సాధించింది అన్న విషయానికొస్తే.నైజాంలో రూ.3.00 కోట్లు, సీడెడ్‌లో రూ.1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ.4.40 కోట్లకు అమ్ముడు పోయింది.ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ.19.50 కోట్లు బిజినెస్ జరిగింది.అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ.1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ.10.20 కోట్లు బిజినెస్ అయింది.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాకు రెండో రోజు రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది.ఫలితంగా ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.1.80 కోట్లు షేర్ వసూలు అయింది.వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ.2.20 కోట్లు వరకూ షేర్ వచ్చింది.ఇలా ఇది రూ.5 కోట్లు వరకూ రాబట్టింది.







