చిరంజీవి మెసేజ్ చేస్తే సుమ అలా ప్రవర్తించారా.. ఇదేం ప్రవర్తన అంటూ?

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న షోల రేటింగ్ లు తగ్గుతున్నా ఆమె స్థాయిలో ప్రతిభ ఉన్న మరే యాంకర్ లేకపోవడంతో సుమకు ఊహించని స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో క్యాష్ షోకు బదులుగా సుమ అడ్డా షో ప్రసారమవుతోంది.

 Suma Behavior About Chiranjeevi Details Here Goes Viral In Social Media , Anchor-TeluguStop.com

అయితే ఈ షోలో చిరంజీవి సుమ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సుమ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపానని చిరంజీవి అన్నారు.

అయితే మూడుసార్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా సుమ నుంచి జవాబు మాత్రం రాలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఇక లాభం లేదనుకుని సుమకు కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.

నేను కాల్ చేసిన తర్వాత సుమ నా నంబర్ ను సేవ్ చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.నేను మెసేజ్ పెడితే సమాధానం ఇవ్వని ఏకైక వ్యక్తి సుమ అని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.

అయితే చిరంజీవి విషయంలో సుమ అలా ప్రవర్తించిందని కొంతమంది ఫ్యాన్స్ సుమ ప్రవర్తనపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సుమ చిరంజీవి కామెంట్ల గురించి స్పందిస్తూ నాకు నిజంగా చిరంజీవి సార్ కాల్ చేశారనే విషయం తెలియదని చిరంజీవి గారు నాకు విష్ చేస్తారా అని అనుకున్నానని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత అసలు విషయం తెలిసి చిరంజీవిని క్షమాపణలు కోరానని సుమ వెల్లడించారు.

చిరంజీవి గెస్ట్ గా హాజరైన సుమ అడ్డా ఎపిసోడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.ఈ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.చిరంజీవి వల్ల ఈ షో రేంజ్ పెరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube