విజయ్ ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టేనా.. అసలేం జరుగుతుంది?

టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ తగ్గలేదు.

ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.లైగర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల రిలీజ్ అయ్యింది.లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమణ సినిమాను ప్రకటించారు.

కానీ ఈ సినిమా లైగర్ ప్లాప్ కారణంగా ఆగిపోయింది.ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా లైగర్ డిజాస్టర్ తట్టుకోలేక ఆగిపోయింది.

Advertisement

ప్రెజెంట్ విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్.

ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది.కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాల కంటే ముందే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.మరి ఈ సినిమా కూడా అటకెక్కినట్టే అంటూ వార్తలు వస్తున్నాయి.

సాయుధ పోరాట నేపథ్యంలో భారీ పీరియాడిక్ సినిమా చేయడానికి సైకుమార్ ప్లాన్ చేసాడు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

2021లోనే ప్రకటించిన ఈ సినిమాను 2022లో సెట్స్ మీదకు తీసుకు వెళతాం అని ప్రకటించినా ఇప్పటికి కూడా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు.సుకుమార్ ప్రెజెంట్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు.దీంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కే అవకాశం లేదు.

Advertisement

దీంతో ఈ సినిమా కూడా అటకెక్కినట్టే అని వార్తలు వస్తున్నాయి.మరి విజయ్ నెక్స్ట్ ఏ సినిమాలను అయినా ప్రకటిస్తాడో లేదో చూడాలి.