తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై సుడిగాలి సుధీర్ హంగామా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలలో కూడా తన సత్తాను చాటుతూ ప్రేక్షకుల మనసులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచు కున్నాడు.జబర్దస్త్ షో ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు.
అంతే కాకుండా ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ నెంబర్ వన్ కమెడియన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సుధీర్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరొక వైపు జబర్దస్త్ షోలో స్కిట్ లు చేస్తూ, మరొకవైపు ఢీ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తూ నెలలో 30 రోజులు బిజీగా ఉంటాడు.
ఇక సుధీర్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యూత్ లో సుడిగాలి సుధీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోలో ఈసారి సుధీర్ కనిపించడం లేదు.దీంతో సుధీర్ అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఢీ షో నుంచి కావాలని సుధీర్ ని తప్పించారు అంటూ కథనాలు వినిపించాయి.కాదు సుధీరే కావాలని ఢీ షో నుంచి వెళ్ళిపోయాడు అంటూ ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి ఢీ షోలో సుధీర్ కనిపించక పోవడంతో అతని అభిమానులు సుధీరును తీసుకు రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఢీ షో లో ఈసారి సుధీర్ కనిపించక పోవడంతో షోను చాలా మంది చూడటం మానేశారు.ఇంకా చెప్పాలి అంటే రేటింగ్స్ విషయంలో ఢీ షో మరీ దారుణమైన స్థితిలోకి వెళ్లి పోయింది.మరి ఢీ షో నుంచి బయటకు రావడానికి అసలు కారణాలను తాజాగా ఒక స్కిట్ లో భాగంగా అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.
తనకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదని అందుకే ఢీ షోని మానేసాను అని హైపర్ ఆది తో కలిసి చేసిన స్కిట్ లో సుధీర్ అసలు విషయాన్ని బయట పెట్టారు.సుధీర్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.