తెలుగులో ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ "కాలింగ్ సహస్ర" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ నూతన సినీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో నటించడం కోసం హీరో సుడిగాలి సుధీర్ ఎక్కువ మొత్తంలోనే పారితోషకం పుచ్చుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ చిత్రంలో సుడిగాలి సుదీర్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను అలరించనున్నాడని అందువల్లే ఇప్పటికే సుడిగాలి సుధీర్ ఈ లాక్ డౌన్ సమయంలో ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనర్ ని కూడా నియమించుకున్నాడని ఇటీవలే యాంకర్ రష్మి గౌతమ్ తెలిపింది.మరోవైపు ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్ కి జోడిగా టాలీవుడ్ బ్యూటిఫుల్ రష్మి గౌతమ్ నటిస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం పై రష్మీ గౌతమ్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించ లేదు.అయితే ఈ విషయం ఎఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.
అయితే ఇటీవలే హీరో సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.
.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy