భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని చెప్పారు.అమర వీరుల త్యాగాల వల్లే స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామని వ్యాఖ్యనించారు.
దేశ విభజన సందర్భంగా ఆగస్ట్ 14న స్మృతి దివస్ జరుపుకుంటున్నామని తెలిపారు.విదేశీ శృంఖలాలను ఛేదించుకుని స్వాతంత్య్రం సాధించుకున్నామన్నారు.
ఎందరో మహనీయులు ఆధునిక భారత్ నిర్మాణానికి కంకణ బద్ధులయ్యారని వెల్లడించారు.







