సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కానీ డైరెక్టర్స్ వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుకుమార్( Sukumar ) అంటే చాలా క్రియేటివ్ గా సినిమాలు తీస్తూ మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు డైరెక్టర్లు గా రాణిస్తున్నారు.

 Success Among Sukumar's Disciples But These Are The Directors, Sukumar , Direct-TeluguStop.com

ఇక్నా నాని హీరోగా నటించిన దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటించాడు.

తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘రంగస్థలం’ ‘ఆర్య 2 ‘ సినిమాల పోలికలు ఉంటాయి.ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) సుకుమార్ వద్ద శిష్యరికం చేశాడు కాబట్టి సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ చిత్రాలకు సుకుమార్ వద్ద పనిచేసాడు.

 Success Among Sukumar's Disciples But These Are The Directors, Sukumar , Direct-TeluguStop.com
Telugu Directors, Karthik Dandu, Munna, Prakash Toleti, Srikanth Odela, Sukumar-

అలాగే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు( Karthik Dandu ) కూడా సుకుమార్ శిష్యుడే.వీళ్ళు మాత్రమే కాదు ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా, కుమారి 21ఎఫ్, 18 పేజెస్ చిత్రాల దర్శకుడు పలనాటి సూర్య ప్రతాప్( palnati surya prathap ) కూడా సుకుమార్ శిష్యుడే.వీళ్లంతా సక్సెస్ అయితే సుకుమార్ కు ఇంకా మంచి పేరు వచ్చింది.భవిష్యత్తులో సుకుమార్ శిష్యులు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అంటే .వాళ్ళకు మంచి నిర్మాతలు దొరికే అవకాశం కూడా ఉంది.

Telugu Directors, Karthik Dandu, Munna, Prakash Toleti, Srikanth Odela, Sukumar-

అయితే సక్సెస్ అయిన వాళ్ళనే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది.సుకుమార్ శిష్యుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.వాళ్ళు ఎవరు అంటే.! 2012 లో రానా తో నా ఇష్టం.అనే చిత్రాన్ని తీశాడు దర్శకుడు ప్రకాష్ తోలేటి( Prakash Toleti ).ఇతను సుకుమార్ శిష్యుడే.కానీ సక్సెస్ కాలేకపోయాడు.

అలాగే దర్శకుడు, ప్లే బ్యాక్ అనే చిత్రాలు తీసిన జక్కా హరి ప్రసాద్( jakka Hari Prasad ) కూడా సుకుమార్ శిష్యుడే.

Telugu Directors, Karthik Dandu, Munna, Prakash Toleti, Srikanth Odela, Sukumar-

ఇతను కూడా ఇంకా సక్సెస్ కాలేదు.అంతేకాదు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు మున్నా( director Munna ) అలియాస్ ఫణి ప్రదీప్ కూడా .సుకుమార్ శిష్యుడే.ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది కానీ .కంటెంట్ వీక్ గా ఉండడంతో మున్నా ఇంకా ఫేమ్ లోకి రాలేకపోయాడు.ఇలా సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube