బాధిత కుటుంబాలను పరామర్శించిన ఉపసర్పంచ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం లోని హై స్కూల్ ఏరియా లో గురువారం రాత్రి హై వోల్టేజ్ కారణం గా పలువురు ఇండ్లలో గల టి.

వి లు, ఫ్యాన్లు, కూలర్ లు కాలిపోగా బాధిత కుటుంబాలను కలిసి ఈ రోజు ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హై స్కూల్ వద్ద గల ప్రమాధకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్సపార్మర్ ను తొలగించాలని అక్కడి ప్రజలు ఆమె కు విన్నవించగా సెస్ అధికారుల దృష్టికీ తీసుకెళ్లుతానని ఆమె అన్నారు.ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా సెస్ పాలకవర్గ సమావేశంలో తీర్మానించాలని కోరుతూ సెస్ ఎం.డి రామకృష్ణ ను కలిసి విన్నవిస్తామని ఆమె అన్నారు.ఆమె వెంట కె సి ఆర్ ఆత్మగౌరవ కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి సుంకి భాస్కర్, బాధ రమేష్ తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News