తొలిరోజే కోవిడ్ కేసు...15 మంది ఐసోలేషన్ కి...!

ఒకపక్క కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం తిరిగి పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

దేశంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పాఠశాలలను తిరిగి ప్రారంభించడం పై భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సుమారు ఏడు నెలల తరువాత తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

అయితే అలా తరగతులు ప్రారంభమయ్యాయో లేదో తొలిరోజే కోవిడ్ కేసు వెలుగు చూడడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.

Student Tests Positive On First Day Of School Reopening In Uttarakhand Uttarakh

ఏడు నెలల తరువాత పాఠశాలలు తెరుచుకోగా,తొలిరోజే ఓ విద్యార్థి కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించడంతో 15 మంది విద్యార్థులను ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తుంది.ఉత్తరాఖండ్ లోని రానీఖేట్‌లో 18 ఏళ్ల విద్యార్థి సోమవారం పాఠశాలకు రాగా.

పరీక్షలు నిర్వహించడంతో విషయం తెలిసిందని స్టేట్‌ కంట్రోల్‌ రూం నోడల్‌ ఆఫీసర్‌ జేసీ పాండే తెలిపారు.అయితే ఒక్క విద్యార్థికి పాజిటివ్ నిర్ధారణ కావడం తో మిగిలిన విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

ఈ నేపథ్యంలో నే వారందరినీ కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది.ఒకపక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ విద్యార్థుల ఎకడమిక్ ఇయర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది అన్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి ప్రారంభించాయి.

అయితే విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా ఇష్టపూర్వకంగానే బడులకు పంపాలని ఈ విషయంలో ఎలాంటి వత్తిడి చేయబోము అంటూ ప్రభుత్వాలు ప్రకటించాయి.ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టానుసారంగానే బడులకు పంపేందుకు వీలు ఉంటుంది.

ఏపీ లో కూడా సోమవారం నుంచే పాఠశాలలు తెరుచుకున్న విషయం విదితమే.తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతె మాత్రం వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 82లక్షల మార్క్‌ను దాటింది.కోలుకున్న వారి సంఖ్య 75.44లక్షలకు పెరిగింది.జాతీయ రికవరీ రేటు 91.68శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం పేర్కొంది.మరణాల రేటు 1.49 శాతంగా ఉందని, కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు ఆరు లక్షల కంటే తక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు