నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.బాసర ట్రిపుల్ ఐటీలో( Basra Triple IT ) ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పీయూసీ ( PUC )రెండో సంవత్సరం చదువుతున్న అరవింద్ ( Aravind )అనే స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే అరవింద్ బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ట్రిపుల్ ఐటీ సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అనంతరం మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
తరువాత అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.