చేతులు కట్టుకుని నిలబడటం మానెయ్యాలి.. పూనమ్ కౌర్ మరో షాకింగ్ ట్వీట్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పూనన్ కౌర్ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది పూనమ్.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆమె చేసే పలు వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా మారుతూ ఉంటాయి.అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆమె ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.

ఇక ఆమెపై మితిమీరి ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఆమె తనకు సంబంధం లేని విషయాలలో కూడా కలగజేసుకుని మరి ఆ విషయాల పట్ల స్పందిస్తూ ఉంటుంది.

Advertisement
Stop Killing Yourself Poonam Kaur Sensational Tweet, Poonam Kaur, Tollywood, Twe

కొన్ని కొన్ని సందర్భాలలో ఆమె దారుణంగా ట్రోలింగ్స్ నీ సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ కౌర్ ఒక సంచలన ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.నేను మనస్ఫూర్తిగా ఆదరించి ప్రేమించే వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండటం చాలా బాధగా అనిపిస్తుంది.

Stop Killing Yourself Poonam Kaur Sensational Tweet, Poonam Kaur, Tollywood, Twe

వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి అని రాసుకొచ్చింది.అదేవిధంగా వాటికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ ను జోడించింది.ఆ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది.

రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ గా మారుతున్నాయి అంటూ మరో ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు