స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.ఈరోజు ఆద్యంతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
తద్వారా వరుసగా ఐదో సెషన్ ను నష్టాల్లో ముగించాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 57,107కు పడిపోయింది.
నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,007 వద్ద స్థిరపడింది.







