వరలక్ష్మి శరత్ కుమార్. పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టింది.
తండ్రి హీరో కావడంతో ఆమె సైతం సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది.మొదట్లో కుటుంబంలో కొన్ని కారణాల వలన ఆమె ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది.
దాదాపు 7, 8 ఏళ్ల ప్రయత్నం తర్వాత వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్ లో డెబ్యూ చేసింది.తొలి నుంచి వరలక్ష్మి నటి కావాలని అనుకుంది.
అందుకే ముంబై లో అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటన కూడా నేర్చుకుంది.నిజానికి బాయ్స్ సినిమాలో ఆమె మొదటిగా హీరోయిన్ గా ఎంపికైన తన తండ్రి వద్దనడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత కాదల్, సరోజా లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించాల్సి ఉండగా కేవలం శరత్ కుమార్ వద్దు అనడం తోనే హీరోయిన్ కాలేకపోయింది.ఆ తర్వాత 2012లో ఆమె నటన ప్రస్థానం మొదలైంది.
తమిళంలో ఎంట్రీ ఇచ్చిన దాదాపు రెండు మూడు ఏళ్లలోనే మలయాళం, కన్నడ, తెలుగు వంటి అన్ని భాషల్లోకి వరలక్ష్మి ఎంట్రీ ఇచ్చేసింది.ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు.
అందుకే హీరోయిన్ గా ఉండాలని ఆమె కోరుకోలేదు, నటిగా మాత్రమే నటించాలని అనుకుంది.తన వయసుకు తగ్గ పాత్రను చేసుకుంటూ వెళ్తోంది.
ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ సినిమాల్లో మాత్రం యమ బిజీగా ఉంది.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో లేడీ విలన్స్ కి కొరత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.దాన్ని వరలక్ష్మి ఖచ్చితంగా పూడ్చింది అని చెప్పవచ్చు.ఎందుకంటే నటన విషయంలో తండ్రి కన్నా వరలక్ష్మి ఒక మెట్టు పైనే ఉంటుంది.
ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే పరిపూర్ణంగా ఆమె విలన్ గా, మెయిన్ లీడ్ గా నటిస్తూనే తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది.ఇటీవల వచ్చిన మైకేల్ సినిమాలో తెలుగు, తమిళ్ డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు విజయ్ సేతుపతి భార్యగా మంచి పాత్రలో నటించింది.
ఇక వీర సింహారెడ్డి వంటి చిత్రంలో సైతం ఆమె లీడ్ రోల్ పోషించింది.

హీరోకి సమానమైన పాత్రను పోషిస్తూ తాను హీరోలకు ఏం తక్కువ కాదు అని చెప్పకనే చెప్తోంది.ఇక మొన్న ఆ మధ్య వచ్చిన యశోద సినిమాలో కూడా ఆమె విలన్ గా నటించింది.ఒక 2023 వ సంవత్సరంలోనే వరలక్ష్మి దాదాపు పది సినిమాల్లో నటిస్తుండగా అందులో మూడు సినిమాలు ఇప్పటికే విడుదలై వరలక్ష్మి కి మంచి పేరును తీసుకొచ్చాయి మిగతా సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఆహార్యం విషయంలోనూ తగిన జాగ్రతలు తీసుకుంటూ సన్నగా తయారయ్యింది.