హైదరాబాద్ లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టీల్ ప్లైఓవర్.!

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది.ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.

ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా వీఎస్టీ వరకు సుమారు 2.6 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం జరిగింది.దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది.సుమారు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లైఓవర్ కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టింది ప్రభుత్వం.ఈ బ్రిడ్జికి జూలై 11, 2020 లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా సరిగ్గా మూడేళ్ల కాలంలో ఈ ప్లైఓవర్ నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

కాగా దక్షిణాదిలోనే అత్యంత పొడవైన స్టీల్ ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు

తాజా వార్తలు