నవరత్నాల అమలుకు కొత్త కమిటీ ఏర్పాటు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చేందుకు ‘నవరత్నాలు’ అనే ఒక సరికొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.ప్రజలకు అవసరమైన మొత్తం తొమ్మిది పథకాలను అందులో పొందుపరిచి బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

 State Level Committee For Implementation Of Navaratnalu-TeluguStop.com

అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నవరత్నాల పథకం అమలు చేయడంపైనే జగన్ బాగా దృష్టిపెట్టాడు.దీనికోసం సచివాలయంలోనే పెద్ద బోర్డు లు ఏర్పాటు చేసి వాటి అమలు ప్రాధాన్యత ఏంటో జగన్ చెప్పకనే చెప్పాడు.

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీని కూడా జగన్ నియమించారు.ఈ కమిటీకి సీఎం వైఎస్ జగన్ ఛైర్మన్‌గా మంత్రులు, అధికారులుతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో సభ్యులుగా డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణీ, ఆళ్ల నాని, నారాయణ స్వామి, బుగ్గన, కన్నబాబు, ఆదిమూలపు సురేష్, శ్రీరంగనాథరాజు, విశ్వరూప, అనిల్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డిలను నియమించారు.ఇక 12 శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలో సభ్యులుగా నియమించారు జగన్.

సలహాదారు జె సామ్యూల్ ని వైస్ ఛైర్మన్ గా నియమించింది.జిల్లా స్థాయిలో ఇంఛార్జ్ మంత్రుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.

చిత్త శుద్ధిగా నవరత్నాల పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube