చిన్న వయస్సులో స్టార్ స్టేటస్ రావడం సులువు కాదు.వచ్చిన స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోవాలంటే కూడా సులువు కాదు.
అయితే నలుగురు హీరోలు మాత్రం 20 సంవత్సరాల వయస్సు కంటే ముందే స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.అయితే ఈ నలుగురు హీరోలలో ముగ్గురు హీరోలు మాత్రం ఇప్పటికీ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకుంటున్నారు.
మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నారు.
చిన్న వయస్సులోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కు స్టార్ స్టేటస్ వచ్చింది.స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి సినిమాలతో చిన్న వయస్సులోనే తారక్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు.
ఆది సినిమా రిలీజయ్యే సమయానికి తారక్ వయస్సు 20 సంవత్సరాల లోపే కావడం గమనార్హం.మరో ప్రముఖ హీరో రామ్ కూడా చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చేశారు.
దేవదాస్ సినిమాతో హీరోగా రామ్( Ram ) కెరీర్ మొదలు కాగా ఈ సినిమా తర్వాత రామ్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తో బిజీగా ఉన్నారు.డబుల్ ఇస్మార్ట్ కొత్త రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.మరింత బెటర్ ఔట్ పుట్ కోసం పూరీ జగన్నాథ్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చినట్టు తెలుస్తోంది.
హీరో నితిన్ ( Nitin )కూడా చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.మరో హీరో తరుణ్( Tarun ) కు సైతం చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ వచ్చేసింది.అయితే తరుణ్ తర్వాత రోజుల్లో వరుస విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిలయ్యారు.ఎంతో టాలెంట్ ఉండటం వల్లే ఈ హీరోలు చిన్న వయస్సులోనే క్రేజ్ ను పెంచుకున్నారని తెలుస్తోంది.