ఇంస్టాగ్రామ్ లో పవన్ ను ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తాజాగా ఇంస్టాగ్రామ్ ( Instagram ) లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటివరకు ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ జూలై నాలుగవ తేదీ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టారు.

దీంతో ఈయనకు నిమిషానికి ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే పోతుంది.జూలై 4వ తేదీన ఎలుగెత్తు.

ఎదిరించు.ఎన్నుకో.

జైహింద్ అంటూ ఒక బయోతో తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు.ఏ హీరో కూడా అతి తక్కువ సమయంలో సాధించలేనటువంటి ఫాలోవర్స్ ను పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు.

Advertisement
These Are The Star Heroines Who Are Following , Pawan Kalyan , Instagram, Socia

కేవలం ఆరు గంటలలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.

These Are The Star Heroines Who Are Following , Pawan Kalyan , Instagram, Socia

ఇక పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టగానే అభిమానులు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నటువంటి కొందరు హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.మరి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నటువంటి ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే.

ప్రముఖ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నటువంటి శృతిహాసన్ ( Shruthi Hassan ) కీర్తి సురేష్( Keerthi Suresh ) శ్రీ లీల ( Sreeleela) వంటి హీరోయిన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

These Are The Star Heroines Who Are Following , Pawan Kalyan , Instagram, Socia

ఇక ఈ స్టార్ హీరోయిన్స్ అందరు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ ఉన్నారు.ఇక ఈయన ఈ ఖాతా ఓపెన్ చేసినప్పటి నుంచి ఫాలోవర్స్ సంఖ్య సుమారు 2.3 మిలియన్లకు పైగానే చేరిపోయింది.అయితే పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక్క పోస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఇలా ఏ పోస్ట్ చేయకుండానే ఈ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు