ఈ స్టార్ హీరోల తమ్ముళ్లు సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయారో తెలుసా?

సినిమా పరిశ్రమలో ఒక హీరో సక్సెస్ సాధిస్తే ఆ హీరో తమ్ముడు లేదా బంధువులు కూడా సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తారు.

అయితే హీరోలకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోల తమ్ముళ్లు, బంధువులు సినిమాల్లో సక్సెస్ సాధిస్తారా అనే ప్రశ్నకు చాలాసార్లు కాదనే సమాధానం వినిపిస్తుంది.

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా మరో తమ్ముడు నాగబాబు హీరోగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం నాగబాబుకు మంచి పేరు ఉంది.

ఈ మధ్య కాలంలో హీరోల తండ్రి పాత్రలలో ఎక్కువగా నటిస్తున్న నాగబాబు ఆ పాత్రలతో విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.సీనియర్ హీరో రాజశేఖర్ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.

సోలో హీరోగా విజయాలు దక్కకపోవడంతో రాజశేఖర్ మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.రాజశేఖర్ హీరోగా తమ్ముడు సెల్వ కీలక పాత్రలో హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సర్ రీమేక్ గ్యాంగ్ మాస్టర్ తెలుగులో తెరకెక్కింది.

Star Heroes Brothers Did Not Shine In Tollywood Industry Details, Did Not Shine,
Advertisement
Star Heroes Brothers Did Not Shine In Tollywood Industry Details, Did Not Shine,

బి గోపాల్ డైరెక్షన్ లో సుబ్బరామిరెడ్డి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.మరో హీరో శ్రీకాంత్ తన తమ్ముడు అనిల్ ను తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాదలిక్కు మరియాదై రీమేక్ ప్రేమించేది ఎందుకమ్మా సినిమాతో పరిచయం చేశారు.

Star Heroes Brothers Did Not Shine In Tollywood Industry Details, Did Not Shine,

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.సినిమాల్లో హీరోలుగా రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ తో పాటు అదృష్టం కూడా కచ్చితంగా ఉండాలని పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల తమ్ముళ్లు ప్రూవ్ చేశారు.అయితే కొంతమంది స్టార్ హీరోల తమ్ముళ్లు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు