టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
అయితే ప్రభాస్ సినిమాల్లోకి రాకముందే ఆయన జాతకంలో ఇండస్ట్రీని ఏలతాడని ప్రభాస్ కుటుంబానికి జ్యోతిష్కుల ద్వారా తెలిసిందని సమాచారం అందుతోంది.
ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఒక జ్యోతిష్కుడిని కలవగా ఆయన ప్రభాస్ తొలి సినిమా అయిన ఈశ్వర్ ను ఆలస్యంగా థియేటర్లలో ప్రదర్శించాలని సూచనలు చేశారని సమాచారం అందుతోంది.
ప్రభాస్ నటించిన బాహుబలి2 కలెక్షన్ల విషయంలో ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్లను ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జ్యోతిష్కుడు చెప్పిన విధంగానే ప్రభాస్ ఇండస్ట్రీకి కింగ్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు ప్రభాస్ పారితోషికం సైతం భారీ స్థాయిలో ఉంది.ఒక్కో సినిమాకు ప్రభాస్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా రీరిలీజ్ అయింది.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.బిల్లా సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ప్రభాస్ నటించిన వర్షం సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







