మన టాలీవుడ్ లో 85 సంవత్సరాల నుండి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాల ప్రభావం జనాల మీద ఏళ్ళ తరబడి ఉంటుంది.
సీనియర్ హీరోలతో పాటుగా నేటి తరానికి చెందిన సూపర్ స్టార్స్ కి కూడా చాలా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.ఇక విలన్ గా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకొని, ఆ తర్వాత హీరో గా కూడా గొప్పగా రాణిస్తున్న మోహన్ బాబు( Mohan Babu ) కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం గా నిల్చింది ‘పెదరాయుడు'( Pedarayudu ) .ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.1994 వ సంవత్సరం లో విడుదలైన ‘నట్టమై’ అనే తమిళ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.ఈ సినిమాని చెయ్యమని తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) మోహన్ బాబు కి స్వయంగా చెప్పాడట.
తమిళం లో హీరో గా శరత్ కుమార్ నటించాడు, ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ కుమార్( Vijay Kumar ) నటించాడు.విజయ్ కుమార్ పాత్రని నేను చేస్తాను, నువ్వు శరత్ కుమార్ పాత్రని చెయ్యి, గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని మోహన్ బాబు కి సలహా ఇచ్చి రీమేక్ చేయించాడు.ఫలితం ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది.
మోహన్ బాబు పాత్ర కంటే రజినీకాంత్ పాత్ర( Rajinikanth Role )కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆయన పాత్ర వల్లే సినిమా మరో లెవెల్ కి వెళ్లిందని ట్రేడ్ పండితుల అభిప్రాయం.
ఈ సినిమాలో మోహన్ బాబు హీరో గా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఫలితంగా కెరీర్ లో ఎన్నడూ చూడని లాభాలను చూసాడు.
అప్పట్లోనే ఈ సినిమా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.సుమారుగా 5 ఏళ్ళ వరకు ఈ చిత్రం రికార్డ్స్ ని ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు.
అయితే ఈ సినిమాని తొలుత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు( Producer Suresh Babu ) రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసి విక్టరీ వెంకటేష్ తో చేయిద్దాం అనుకున్నాడు.అందులో భాగంగానే ఒకసారి ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా చెప్పాడట.వెంకటేష్( Venkatesh ) చూసాడు కానీ ఎందుకో ఆయనకీ పెద్దగా నచ్చలేదు.అంతే కాదు, ఈ పాత్రకి తానూ సరిపోను అని అనుకున్నాడట.అలా ఈ చిత్రం వెంకటేష్ చేతి నుండి మోహన్ బాబు చేతుల్లోకి వెళ్ళింది.ఒకవేళ వెంకటేష్( Venkatesh ) ఈ చిత్రం చేసి ఉంటే ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయిలు రాబట్టి ఉండేది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఆ తర్వాత వెంకటేష్ కొన్నాళ్ళకు ఇదే గెటప్ తో సూర్యవంశం అనే సినిమా చేసాడు, ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.