నేను హీరోనని తెలిసి నవ్వారు.. ధనుష్ కామెంట్స్ వైరల్..!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ధనుష్ ఒకరనే సంగతి తెలిసిందే.

రఘువరన్ బీటెక్, మారి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ రజనీకాంత్ అల్లుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితం.

అయితే ధనుష్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు.ఒక ఇంటర్వ్యూలో ధనుష్ తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.2002 సంవత్సరంలో వైజాగ్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి హీరో ఎవరని అడిగాడని తాను తన పేరు చెబితే అవమానిస్తారని భావించి అక్కడే ఉన్న సుదీప్ ను చూపించానని తెలిపారు.ఆ వ్యక్తి కొంత సమయం సుదీప్ తో మాట్లాడి తనను చూస్తూ వీడు హీరోనా అని నవ్వుతూ తనకంటే రిక్షావాళ్లు ఎంతో బాగుంటారని కామెంట్లు చేశారని తెలిపారు.

ఆ తరువాత నాన్నకు ఫోన్ చేసి ఎదురైన అవమానాల గురించి చెబితే అవి అసలు కష్టాలే కాదని నాన్న అన్నారని ధనుష్ పేర్కొన్నారు.

Star Hero Dhanush Comments About His First Movie, Star Hero Dhanush,dhanush Mov

తన కుటుంబంలో తానే అందరి కంటే చిన్నవాడినని చిన్నప్పుడు తాను చెన్నైలో ఉన్న మురికివాడలో జీవనం సాగించానని ధనుష్ చెప్పారు.తనకు స్టార్ హోటల్ లో చెఫ్ కావాలని ఉండేదని సినిమాలపై అస్సలు ఆసక్తి ఉండేది కాదని ఇంటర్ చదివే సమయానికే వంటలు చేయడం తనకు బాగా వచ్చని ధనుష్ అన్నారు.తను నటించిన తొలి సినిమా హిట్టైనా తన నటన గురించి, ఫేస్ గురించి విమర్శలు వచ్చాయని ధనుష్ తెలిపారు.

Advertisement
Star Hero Dhanush Comments About His First Movie, Star Hero Dhanush,dhanush Mov

రెండో సినిమాగా అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన కాదల్ కొండేన్ లో నటించానని ఆ సినిమాలో తన నటనకు కూడా మంచి పేరు వచ్చిందని ధనుష్ అన్నారు.ఆ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బొకే పంపారని ఆ తరువాత ఐశ్వర్య పరిచయం కావడం పరిచయమైన ఆరు నెలల్లోనే పెళ్లి కావడం జరిగిందని ధనుష్ వెల్లడించారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు