40 ఏళ్లలో ఎన్నడూ చేయని పని చేసిన చిరంజీవి .. ఏంటి అది ?

చిరంజీవి.సినిమా ఇండస్ట్రీని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మెగాస్టార్. మెగా ఫ్యామిలీకి ఆయనే మూలపురుషుడు.చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యాక ఆయన కుటుంబం నుంచి డజన్ల కొద్ది హీరోలు తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయ్యారు.ఆయన కొడుకు అయినా రామ్ చరణ్ కూడా ప్రస్తుతం సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.1978లో మన ఊరి పాండవులు సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు చిరంజీవి.ఇక ప్రస్తుతం 2022లో గాడ్ ఫాదర్ సినిమాతో తన 153 వ సినిమాని విడుదల చేసి ఘనవిజయం సాధించాడు.

 Chiranjeevi Never Doing Thing In 40 Years Details, Chiranjeevi, Megastar Chiranj-TeluguStop.com

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మరి ఎందుకు ఇంత ప్రత్యేకించి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నామనే కదా మీ అనుమానం ఆ విషయంలోకి వస్తాను పదండి.150 కి పైగా సినిమాలు తీసిన చిరంజీవి కెరియర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, అంతకుమించిన డిజాస్టర్సు, అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.సినిమా అన్నాక గెలుపోటములు సర్వసాధారణమే మరి ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా ? అసలు విషయం ఏంటి అంటే ఇన్ని సినిమాలు తీసిన చిరంజీవి ఇప్పటివరకు చేయని ఒకే ఒక పని అది డిస్ట్రిబ్యూటర్స్ కి తన సినిమా పరాజయం పాలైతే డబ్బులు వెనక్కి ఇవ్వడం.ఈ 40 ఏళ్ల కెరియర్ లో చిరంజీవి ఎప్పుడూ కూడా అలాంటి పని చేయలేదు.

కానీ ఆచార్య సినిమా ఫలితం తర్వాత ఆ ఒక్క పని చేయాల్సి వచ్చింది ఎందుకంటే దాదాపు 90 శాతం కలెక్షన్స్ రాకపోవడంతో బయ్యర్ లు అంత కూడా రోడ్డు పాలవాల్సిన పరిస్థితి రావడంతో చిరంజీవి కొంత డబ్బును వెనక్కి ఇచ్చేసాడు.చిరంజీవి ఇన్నేళ్ల కెరియర్ లో ఏనాడు కూడా నిర్మాతకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో వేలు పెట్టలేదు.కానీ ఆచార్య సినిమా ఫలితం చిరంజీవిలో ఈ మార్పును తీసుకొచ్చింది.

చాలామంది స్టార్ హీరోలు ఇప్పటికే ఇలాంటి పని చేసిన అనుష్క లాంటి హీరోయిన్స్ సైతం డబ్బులు వెనక్కిచ్చిన రోజులు ఉన్నప్పటికీ చిరంజీవి ఆ పని చేయకపోవడం కొంచెం ఆసక్తికరమైన విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube