ఆ ఫార్ములాలో చిక్కుకుపోయిన బాలయ్య.. అలాంటి ప్రయోగాలు చేస్తే బెటర్!

స్టార్ హీరో బాలకృష్ణ ఒకే తరహా సినిమాలలో నటిస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలను గమనిస్తే ఈ విషయం సులువుగానే అర్థమవుతుంది.

 Star Hero Balakrishna Story Formula Become Hot Topic Details Here Goes Viral ,-TeluguStop.com

బాలయ్య అభిమానులకు ఆయన సినిమాలు నచ్చుతున్నా సాధారణ అభిమానులను ఆకట్టుకునే విషయంలో ఈ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.బాలయ్య ఒకే ఫార్ములాలో చిక్కుకుపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరి వీరసింహారెడ్డి రిజల్ట్ తో బాలయ్య మారతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.బాలయ్య తర్వాత సినిమాల కథలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.వీరసింహారెడ్డి సినిమా విషయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య నటన మాత్రం అద్భుతంగా ఉంది.

బాలయ్య పర్ఫామెన్స్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సందేహం అవసరం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఫస్టాఫ్ లో ఉన్న హైలెట్ సీన్లు సెకండాఫ్ లో ఉండి ఉంటే బాలయ్య కెరీర్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉండేది.బాలయ్య కాలానికి అనుగుణంగా మారాల్సి ఉంది.మూస కథలకు నో చెబుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా జాగ్రత్త పడాల్సి ఉంది.

బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.బాలయ్య తన రేంజ్ ను మార్చే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు.కథల ఎంపికలో బాలయ్య మరింత క్లారిటీతో వ్యవహరించాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube