ఇక వార్ వన్ సైడ్‌ అయినట్లేనా.. వాల్తేరు వీరయ్య కుమ్ముకోవడమే!

ఈ సంక్రాంతి కి నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారంటూ గత రెండు మూడు నెలలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే.నేడు సంక్రాంతి పోరులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Chiranjeevi Waltair Veeerayya Movie Interesting Update Details, Balakrishna, Chi-TeluguStop.com

అభిమానులకు పరవాలేదు అనిపించినా కూడా సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా ను పెద్దగా రుచించడం లేదు.

రేటింగ్స్ కూడా తక్కువగానే వచ్చాయి.

దాంతో వీర సింహా రెడ్డి సినిమా యొక్క రెండవ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది.ఇక రేపు మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

వీర సింహా రెడ్డి సినిమా కి నెగెటివ్ టాక్ వచ్చిన కారణంగా వాల్తేరు వీరయ్య సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటికే విడుదలైన తెగింపు మరియు వీర సింహా రెడ్డి సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.కనుక రాబోయే వాల్తేరు వీరయ్య కచ్చితంగా భారీగా వసూళ్ల ను నమోదు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైన తర్వాత దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయితే వారసుడు సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని టాక్ వినిపిస్తుంది.కనుక సంక్రాంతి పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది, మరో రెండు రోజుల్లో ఎవరి ఆధిపత్యం ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.వాల్తేరు వీరయ్య కు ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంది.వార్ వన్ సైడ్ అయినట్లే అవ్వాలి అంటే వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube