నాకు ఇష్టమైన బౌలర్లు వీళ్లే.. వైరల్ అవుతున్న స్టార్ హీరో బాలయ్య కామెంట్స్!

Star Hero Balakrishna Favoruite Comments Goes Viral In Social Media , Star Hero Balakrishna, Srilila, Anil Ravipudi, Anil Kumble, Paul Adams, Shane Warne

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం ఏ పని చేసినా ఆయనకు అనుకూల ఫలితాలు వస్తుండటం గమనార్హం.ఓటీటీలలో బాలయ్య చేసిన షోలు విజయం సాధించగా బాలయ్య నటించిన సినిమాలు సైతం కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

 Star Hero Balakrishna Favoruite Comments Goes Viral In Social Media , Star Hero-TeluguStop.com

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్నారు.శ్రీలీల( Srilila ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

సినిమాలో బాలయ్య శ్రీలీలకు వరుసకు బాబాయ్ అవుతారని వీళ్లిద్దరి కాంబో సీన్లు అద్భుతంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ షూట్ జరుగుతోందని ఈ సాంగ్ షూట్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

బాలయ్య ఇకపై కూడా వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఐపీఎల్ తొలి మ్యాచ్ కు బాలయ్య కామెంటరీ చెప్పగా ఆ సమయంలో బాలయ్య చెన్నై ఎంత స్కోర్ చేస్తుందో ముందుగానే అంచనా వేసి అందరినీ బాలయ్య ఒకింత ఆశ్చర్యపరిచారు.కాలేజ్ రోజులలో నేను క్రికెట్ ఆడేవాడినని బాలయ్య పేర్కొన్నారు.

ఎంతోమంది క్రికెటర్లతో నాకు పరిచయం ఉందని ఆయన పేర్కొన్నారు.

అనిల్ కుంబ్లే, పాల్ ఆడమ్స్, షేన్ వార్న్ నాకు ఇష్టమైన బౌలర్లు అని బాలయ్య చెప్పుకొచ్చారు.

బాలయ్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలయ్య ఈ సినిమా కోసం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను సొంతం చేసుకుంటున్నారు.

బాలయ్య ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మాస్ మసాలా సినిమాలో నటించనున్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా అఖండకు సీక్వెల్ అని బోగట్టా.

Video : Star Hero Balakrishna Favoruite Comments Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube