'RC15' లేటెస్ట్ అప్డేట్.. బ్యూటిఫుల్ సాంగ్ కంపోజర్ గా స్టార్ కొరియోగ్రాఫర్!

అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.ఇక ఈ ఇండియన్ జేమ్స్ కేమరూన్ ప్రెజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమ చేస్తున్నాడు.RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా కావడంతో చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

 Star Choreographer Johnny Master Composed Special Song Moments In Rc15-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.ఆర్సీ 15 ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇలా ఉండగానే ఈ సినిమా షూటింగ్ కు తో పాటు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా షూట్ చేస్తున్నాడు.రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ప్రెజెంట్ రాజమండ్రి లో షూటింగ్ జరుపు కుంటుంది.

వీలైనంత తొందరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫాస్ట్ గా షూట్ పూర్తి చేస్తున్నారు.

Telugu Dil Raju, Shankar, Kiara Advani, Ram Charan, Rc, Choreographer-Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజర్ గా చేసారని.డ్యాన్స్ మూమెంట్స్ సూపర్ గా కంపోజ్ చేసినట్టు టాక్.

శంకర్ రేంజ్ కు తగ్గట్టుగా ఈ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చిత్రీకరించారని.

ఈ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.మరి మొదటిసారి వస్తున్న ఈ కాంబో ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube