టిక్‌టాక్‌ స్టార్లను పట్టించుకున్నంతా మమ్మల్ని పట్టించుకోరా?

మన దేశంలో క్రికెట్ కు సినిమాకు ఉన్నంత ఆదరణ,ప్రభుత్వ సహకారం మరే ఇతర రంగానికి లేదు.

ఒకరకంగా ఈ దౌర్భాగ్యమే జనాభా పరంగా రెండవ స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ లో ఒకటి లేదా రెండు గోల్డ్ మెడల్స్ ను మాత్రమే దక్కించుకోగలుగుతుంది.

ఈ అంశంపై క్రీడా విశ్లేషకులు ఎన్నోసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.అయినా ప్రభుత్వం,ప్రజల ధోరణిలో ఎటువంటి మార్పు రావట్లేదు.

తాజాగా ఈ అంశంపై ఓ స్పోర్ట్స్ ఉమెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సాధించారు.ఆమె ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నానని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

దానిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తనకు 5 లక్షల ఆర్థిక సాయం అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.ఐదు నెలలు పూర్తవుతున్నముఖ్యమంత్రి ఇచ్చిన ఒక హామీ ప్రయోజనాన్ని కూడా తాను పొందలేదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికం సాయం టిక్‌టాక్‌ స్టార్లకు మాత్రం వెంటనే ఇచ్చారని తనకు మాత్రం ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని మీడియా ముఖంగా వాపోయారు.

Advertisement

తాజా వార్తలు