టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఒక ఎత్తు అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మరొక ఎత్తు అని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల భాషల్లో విడుదల అయ్యి భారీ స్థాయిలో కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో ఉన్నన్ని రోజులు కలెక్షన్స్ ని సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అవార్డుల మీద అవార్డులను అందుకుంటుంది.
టాలీవుడ్ లో కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా పుష్ప,కేజిఎఫ్ 2, కాంతార, కార్తికేయ ఇలా ఎన్నో సినిమాలు పాండియా లెవెల్లో విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ను కూడా తెచ్చిపెట్టాయి.ఇది ఇలా ఉంటే మధ్యకాలంలో విడుదలైన టాలీవుడ్ సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మితమై ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
కానీ బాలీవుడ్ సినిమాలు భారీ స్థాయిలో విడుదల అయ్యి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు కోట్ల బడ్జెట్తో నిర్మితమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచడం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో నష్టపోతున్న విషయం తెలిసిందే.

అయితే ఇందుకు గల కారణాన్ని తాజాగా దర్శకుడు రాజమౌళి చెప్పుకొచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి భాగంగా మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల రిజల్ట్ పై స్పందించారు.బాలీవుడ్ లోకి కార్పొరేట్లు అడుగుపెట్టారు.అప్పటినుంచి నటీనటులకు దర్శకులకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇవ్వడం మొదలయ్యింది.ఎలాగోలా చేతికి డబ్బు వస్తుండడంతో ఎలాగైనా సక్సెస్ సాధించాలి అన్న కసి కొంచెం తగ్గింది.అందువల్లే బాలీవుడ్ సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు రాజమౌళి.
కానీ టాలీవుడ్ లో పరిస్థితి లేదు ఇక్కడ గెలుపు కోసం కచ్చితంగా ఈ ఈదాల్సిందే లేదంటే మునిగి పోవాల్సిందే అని తెలిపారు రాజమౌళి.







