అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్‘.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించగా.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.ఈ సినిమా తర్వాత వీరి లైనప్ కూడా పాన్ ఇండియా టార్గెట్ గానే జరుగుతుంది.
ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు నాలుగేళ్ళ పాటు నిరీక్షించారు.మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమా ఇక్కడే కాదు.వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఈ క్రమంలోనే రాజమౌళి అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం కోసం తనవంతు కృషి చేస్తున్నారు.
ఇప్పటికే అక్కడ ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.మరి ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో తెలియదు కానీ.ప్రొమోషన్స్ మాత్రం అక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయట.ఇప్పుడు రాజమౌళి కూడా సపరేట్ గా జపాన్ మీడియాతో ప్రొమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.
తాజాగా జపాన్ మీడియా కోసం జక్కన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.







