సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవ లే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడంతో రాజమౌళి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని.
అలాగే భారీ తారాగణం, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా తప్పకుండ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం 500 నుండి 600 కోట్ల బడ్జెట్ ఉంటుంది అని టాక్ ఒకటి వినిపిస్తుంది.విజయేంద్ర ప్రసాద్ అందించిన పవర్ఫుల్ స్టోరీని రాజమౌళి పాన్ ఇండియాను మించేలా తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందించనున్నాడు.

అయితే రాజమౌళి సినిమా అంటే ఏ హీరో అయినా సంవత్సరాల పాటు డేట్స్ ఇవ్వాల్సిందే.ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్ల సమయం ఇవ్వగా.ట్రిపుల్ ఆర్ కోసం చరణ్, ఎన్టీఆర్ మూడేళ్లకు పైగానే సమయం కేటాయించారు.
ఇక ఇప్పుడు మహేష్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు..
ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో స్టార్ట్ అవ్వనుండగా.అప్పటి నుండి దాదాపు మూడేళ్ళ పాటు ఈయన డేట్స్ కేటాయించారని తెలుస్తుంది.
మరి ఇదే నిజం అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద మూడేళ్ళ తర్వాతనే కనిపించనున్నారు.