Allu Arjun Sriram: సక్సెస్ తలకెక్కని స్టార్ హీరో అల్లు అర్జున్.. కోలీవుడ్ హీరో శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒకప్పటి హీరో నటుడు శ్రీరామ్( Hero Sriram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకరికొకరు, రోజా పూలు వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయిన హీరో శ్రీరామ్ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Sriram Talking About Allu Arjun-TeluguStop.com

ఇక త్వరలోనే పిండం అనే సినిమాతో( Pindam Movie ) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీరామ్.కాగా సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పిండం.

ఈ సినిమా డిసెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే శ్రీరామ్ ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.మొదట్లో నా సినిమా హిట్ అవ్వాలంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకోవాలి అనే ముద్ర పడిపోయింది.

Telugu Allu Arjun, Gangotri, Sri Ram, Pindam, Pushpa, Sriram-Movie

అలా స్టార్టింగ్ లో నేను చాలా కష్టపడ్డాను.2006 నుంచి 2022 వరకు తాను ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం ఒకరికొకరు మూవీ తరువాత నాకు యాక్సిడెంట్( Accident ) అయ్యింది.ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.

ఆ ప్రమాదం తర్వాత నేను తెలుగు సినిమాల వైపు రాలేదు.నాకు కొంచెం ఇగో ఎక్కువ అవకాశాలు ఇమ్మని నేను ఎవరిని అడగలేను.

అందువల్లే రాలేకపోయాను అని చెప్పుకొచ్చాడు శ్రీ రామ్.

Telugu Allu Arjun, Gangotri, Sri Ram, Pindam, Pushpa, Sriram-Movie

అనంతరం శ్రీరామ్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మాట్లాడుతూ.నాకు తెలుగు హీరోస్ లో నచ్చిన హీరోలు అంటే అల్లు అర్జున్.నాకు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా ఇష్టం.

నేను అల్లు అర్జున్ ను గంగోత్రి మూవీకి ముందు చూసాను.ఆ తరువాత ఈ మధ్య ఒక ఈవెంట్ లో చూసాను.

ఆయన నన్ను చూడగానే హే బ్రో ఎప్పిడి ఇరుకే బ్రో అంటూ తమిళ్ లో పలకరించాడు.ఎంతో స్వీట్ పర్సన్, సక్సెస్ తలకెక్కని హీరో అని చెప్పుకొచ్చాడు శ్రీ రామ్.

కాగా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరామ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube