నిరాశ పర్చిన ‘శ్రీమంతుడు’

టైటిల్‌ చూసి ఆశ్చర్యపోతున్నారా.రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతున్న ‘శ్రీమంతుడు’ నిరాశ పర్చడమేంటని ఆలోచిస్తున్నారా.

అవును మేం చెప్పేది నిజమే, ‘శ్రీమంతుడు’ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.ఏకంగా డిజాస్టర్‌గా మిగిలింది.

Srimanthudu (Selvandhan) A Huge Disaster-Srimanthudu (Selvandhan) A Huge Disaste

తమిళంలో ‘శ్రీమంతుడు’ సినిమా ఫలితం ఇది.‘సెల్వంధన్‌’గా తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిందని తమిళ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.అక్కడ కలెక్షన్స్‌ కనీస స్థాయిలో కూడా రావడం లేదు.

మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ‘శ్రీమంతుడు’ తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ మూడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది.అక్కడ భారీగా ప్రచారం చేశారు.మహేష్‌బాబు సైతం ప్రచారంలో పాల్గొన్న విషయం తెల్సిందే.

Advertisement

ఎంత ప్రచారం చేసినా కూడా ఈ సినిమాకు మొత్తం కోటి రూపాయల గ్రాస్‌ రాలేదని సమాచారం అందుతోంది.తమిళనాడులో దాదాపు 100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం 45 లక్షల షేర్‌ను మాత్రమే రాబట్టినట్లుగా ట్రేడ్‌ సమాచారం అందుతోంది.

ఈ సినిమాతో మొదటి సారి మహేష్‌బాబు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.కాని ఫెయిల్‌ అయ్యింది.

మహేష్‌ తర్వాత చిత్రం ‘బ్రహ్మోత్సవం’ కూడా తమిళంలో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.మరి ఆ సినిమా అయినా మహేష్‌కు అక్కడ సక్సెస్‌ను తెస్తుందేమో చూడాలి.

How To Get Rid Of Chili Burn
Advertisement

తాజా వార్తలు