దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకోవాలో ఈమధ్య ఎవరైనా సరే శ్రిలీలను చూసే నేర్చుకోవాలి.ఈ అమ్మడికి తాజాగా ధమాకా సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది.
ఇంతకుముందే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా పెళ్లి సందడి సినిమా వచ్చింది.ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ సాధించడంతో అందరి దృష్టి శ్రీ లీల పై పడింది.
పెళ్లి సందడి సినిమాలో రోషన్ కి పోటీ గా శ్రీ లీల డ్యాన్స్ స్టెప్పులు చూసి అందరూ అదరహో అన్నారు.ఇక రవితేజ వయసులో సగం కూడా ఉండదు.
అయినా కూడా అందరూ రవితేజను పక్కన పెట్టి మరి శ్రీ లీల నే చూశారంటే ఆశ్చర్య పోవాల్సిందే.దమాక సినిమాకి అయితే శ్రీ లీల కనిపించిన ప్రతిసారి యూత్ రెచ్చిపోయి మరి థియేటర్లలో డాన్స్ లు చేశారు.
అంతలా ఈ సినిమా శ్రీలల కు క్రేజ్ ని ఇచ్చింది.ఇక దొరికిందే అవకాశం అన్నట్టుగా శ్రీ లీల అరడజన్ కి పైగా సినిమాలను లైన్ లో పెట్టింది.
ఇప్పటికే జూనియర్, అనగనగా ఒక రోజు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ధమాకా సినిమా హిట్ తర్వాత చాలా నిర్మాణ సంస్థలు శ్రీ లీల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొదటగా బాలకృష్ణ 108 వ సినిమా గా వస్తూ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం శ్రీ లీల ను ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంచుకున్నారు.ఆ తర్వాత బోయపాటి దర్శకత్వం లో రామ్ పోతినేని హీరో గా వస్తున్న సినిమాలో సైతం శ్రీ లీల కన్ఫర్మ్ అయ్యింది.

అంతకు ముందే వారాహి బ్యానర్ వారికి కూడా కొన్ని డేట్స్ కమిట్ అయ్యిందట ఈ అమ్మడు.ఇవే కాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తుండగా, యూత్ స్టార్ గా ఉన్న నితిన్ తో, నవీన్ పోలిశెట్టి తో కూడా చెరొక సినిమాలో నటిస్తుంది.ఇలా సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరికి డేట్స్ ఇస్తూ అన్ని బ్యాలన్స్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది.మరో పదేళ్లు కష్టపడ్డ రాని అమౌంట్ వచ్చే రెండేళ్లలో సంపాదిస్తుంది శ్రీ లీల. మొత్తానికి ఈ అమ్మడి ప్లాన్ అదిరింది కదా.