టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar ) ఒకరు.ఈ మధ్య కాలంలో హిట్టైన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు.
అయితే 65 ఎకరాల ఫామ్ హౌస్ లో( 65 Acres Farmhouse ) పిశాచిలా ఉంటున్నానని శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న శ్రీకాంత్ అయ్యంగార్ తనకు 65 ఎకరాల లే అవుట్ ఉందని అందులో చిన్న ఇల్లు ఉందని పేర్కొన్నారు.
అందులో ఉంటున్నానని చాలా డిప్రెషన్ గా ఉందని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.ఓయూ కాలనీలో ఉన్న సమయంలో టీ తాగడానికి వెళ్లినా సెల్ఫీ( Selfie ) కావాలని అడుగుతారని ఆయన కామెంట్లు చేశారు.
మంచి నటుడిగా పేరు సంపాదించుకోవాలని అనుకున్నానని కానీ టెన్షన్స్ వద్దని శ్రీకాంత్ అయ్యంగార్ తెలిపారు.
సెల్ఫీల గోల ఎక్కువ కావడంతో అక్కడినుంచి ఇక్కడికి షిప్ట్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఒంటరితనం మామూలుగా లేదని శ్రీకాంత్ అయ్యంగార్ వెల్లడించారు.ప్రతిరోజూ పండగే( Pratiroju Pandage ) సినిమా చేసిన తనపై ఒంటరితనం ప్రతిరోజూ దాడి చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
నా లైఫ్ చాలా చిన్నదని గర్ల్ ఫ్రెండ్, వైఫ్ ఉంటే ఫోన్ చేసి అన్నీ అడిగేదని ఆయన కామెంట్లు చేశారు.
జనవరిలో బ్యాక్ పెయిన్ ఎక్కువ కావడంతో పీపాలు పీపాలు తాగానని నా వయస్సు ప్రస్తుతం 50 అని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.నాతో బ్రతకడం ఎంతో కష్టమని ఈ విషయం నాకు బాగా తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.నా హార్ట్, బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ కు గురయ్యామని శ్రీకాంత్ అయ్యంగార్ కామెంట్లు చేశారు.
శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.