Anita Chaudhary krishna chaitanya : తనని పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ ఫోన్ చేశారు.. అనిత చౌదరి కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా పలు సీరియల్స్ లో నటిగా వెండితెర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె 90 లలోనే యాంకర్ గా వరుస కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అనంతరం బుల్లితెరపై ఋతురాగాలు కస్తూరి నాన్న వంటి సీరియల్స్ లో నటించిన మెప్పించారు.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఈమె ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే తాతగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కస్తూరి తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమని అయితే తన తండ్రి వదిలి వెళ్ళిపోవడంతో తన తల్లి కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు.

ఈ క్రమంలోనే చిన్నతనంలోనే తన కుటుంబ బాధ్యతలను తన చేతిలోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఇక తాను పెళ్లి చేసుకోకూడదని ఆలోచనలో ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యను చూడగానే పెళ్లి ఆలోచన వచ్చిందని తెలిపారు.

Srikanth Called To Marry Him Anita Chaudharys Comments Are Viral Srikanth, Calle
Advertisement
Srikanth Called To Marry Him Anita Chaudharys Comments Are Viral Srikanth, Calle

అప్పటికే తను అమెరికాలో ఉండేవారని, తాను అమెరికాలో ఉంటే రానని చెప్పి కృష్ణ చైతన్య ప్రపోజ్ చేసిన ఈమె రిజెక్ట్ చేశారట.అయితే కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్ కి కజిన్ కావడంతో ఒకరోజు ఆయన ఫోన్ చేసి మా వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం అమెరికా నుంచి వచ్చారు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ అడిగారు.ఇలా నా దగ్గర కాకుండా అందరితో అడిగిస్తున్నారని దాదాపు మూడు సంవత్సరాల పాటు తనతో మాట్లాడలేదని అనంతరం కృష్ణ చైతన్య నేరుగా తనకు ప్రపోజ్ చేయడంతో మా పెళ్లి జరిగిపోయిందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిత చౌదరి తన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలిపారు.

ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిత చౌదరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు