సినిమా ఇండస్ట్రీలో శ్రీహరి సినిమాలు అంటే చులకన.. ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వాళ్లలో శ్రీహరి( Srihari ) ఒకరు.

శ్రీహరి మరణించి 10 సంవత్సరాలు అవుతున్నా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య తగ్గడం లేదు.

అయితే ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్( director Chandra Mahesh ) ఒక సందర్భంలో శ్రీహరి గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.చంద్ర మహేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాకు ఒకే సమయంలో చిరంజీవి, వెంకటేశ్( Chiranjeevi, Venkatesh ) సినిమాలకు పని చేసే ఆఫర్లు వచ్చాయని చంద్ర మహేష్ అన్నారు.ఆరేడు నెలల తర్వాత నేను జయం మనదేరా సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిందని చంద్ర మహేష్ వెల్లడించారు.

వెంకటేశ్ తో సినిమా లేట్ కావడంతో మరెవరి డేట్స్ దొరకలేదని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో శ్రీహరి నా ఇంటికి వచ్చి కొంత డబ్బు ఇచ్చి సినిమా తీయమన్నారని చంద్ర మహేష్ పేర్కొన్నారు.

Advertisement

శ్రీహరి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగిన సమయంలో సంతోషం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు.శ్రీహరి గారితో మూడు సినిమాలు చేశానని ఆయన కామెంట్లు చేశారు.శ్రీహరి సినిమాలు అంటే ఆ సమయంలో చిన్నచూపు ఉండేదని ఆయన సినిమాలు అంటే డైలాగ్స్, ఫైట్స్ ఉంటాయని అనుకునేవారని కెరీర్ తొలినాళ్లలో శ్రీహరి సినిమాలపై అలాంటి అభిప్రాయం ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక్కడే సినిమా ప్రెస్ మీట్ కు రాకపోవడంతో ప్రొడ్యూసర్ డబ్బులివ్వలేదా అని కామెంట్ చేశారని చంద్ర మహేష్ అన్నారు.చిరంజీవి రామానాయుడు కాంబినేషన్ లో ఒక సినిమా నా డైరెక్షన్ లో ఫిక్స్ కాగా ఆ సినిమాకు కథ సెట్ కాలేదని ఆయన తెలిపారు.అలా చిరంజీవి గారితో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయిందని చంద్ర మహేష్ కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు