ఆధ్యాత్మిక గురువు ప్రాణానికి ముప్పు....?

రాజకీయ నాయకులకు, ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్నవారి ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి ప్రాణ హాని ఉంటుంది.‘మీ ప్రాణాలు తీస్తాం’ అంటూ ఉగ్ర సంస్థల నాయకులు బెదిరిస్తుంటారు.అయితే ఉగ్రవాదులు రాజకీయ నాయకులను, పదవుల్లో ఉన్నవారినే కాకుండా ఆధ్యాత్మిక గురువులను కూడా టార్గెట్‌ చేసుకుంటున్నారు.ప్రధానంగా ముస్లిం ఉగ్రవాద సంస్థలు హిందూ ఆధ్యాత్మిక గురువులపై దృష్టి పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వాలకు తాజాగా జారీ చేసిన ఆదేశాలను బట్టి తెలుస్తోంది.

 Sri Sri Ravishankar Is Facing Death Threat From Jehadi Militant Groups-TeluguStop.com

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘ఆర్‌్ట ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్‌ ప్రాణాలకు జిహాదీ మిలిటెంట్‌ గ్రూపుల నుంచి ప్రాణ హాని ఉన్నట్లు కేంద్రం రాష్ర్ట ప్రభుత్వాలకు తెలియచేసింది.కాబట్టి ఆయన రాష్ర్టాల్లో పర్యటించడానికి వచ్చినప్పుడు ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరింది.

ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ , పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్తాన్‌ రవి శంకర్‌ను చంపుతామని బెదిరించాయి.రవిశంకర్‌ మలేషియాకు వెళ్లినప్పుడు ఆయన్ని హతమారుస్తామని ఉగ్రవాదులు బెదిరించారు.

మలేషియాలో ఆయన హిందూ మతానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.ప్రజలకు శాంతి గురించి, ప్రశాంతంగా జీవించడం గురించి బోధించే ఆధ్యాత్మిక గురువులకు కూడా ప్రశాంతత లేదన్నమాట….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube