భద్రాచలంలో ఘనంగా శ్రీరామ కల్యాణ మహోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల క్షేత్రం( BadrachalamTemple )లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా భద్రాచలంలో శ్రీరామ కల్యాణ మహోత్సవం జరుగుతోంది.

 Sri Rama Kalyana Mahotsavam Is Celebrated In Bhadrachalam , Badrachalamtemple ,-TeluguStop.com

అభిజిత్ లగ్నంలో రాములోరి కల్యాణ వేడుక కొనసాగుతోంది.ఈ క్రమంలో ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎస్ శాంతకుమారి( CS Shanti Kumari ) పట్టువస్త్రాలను సమర్పించారు.

శ్రీరాముని కల్యాణ మహోత్సవ మహాద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.కాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామ చంద్రస్వామి( sri sita rama chandra swamy ) వారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.అదేవిధంగా రాముని కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం సుమారు 2.50 లక్షల లడ్డూలను ఆలయ అధికారులు సిద్ధం చేశారని తెలుస్తోంది.అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఇందులో భాగంగా స్టేడియంలో 50 టన్నుల ఏసీ, వంద కూలర్లతో పాటు 270 ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube