దీపావళి పండుగ సందర్భంగా అందంగా ముస్తాబైన శ్రీ భాగ్య లక్ష్మీ అమ్మవారి దేవాలయం

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్య లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండే కాకుండా చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా వస్తారు.

భక్తుల క్యూ లైన్ చార్మినార్ నుండి గుల్జార్ హౌజ్ వరకు ఉంటుంది, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ తరుపున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తుల క్యూ లైన్ కొరకు బారికెట్లు ఏర్పాటు చేశారు, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటు చేశారు.

Sri Bhagya Lakshmi Temple Decorated Nicely On The Occasion Of Deepavali Festival

కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు దేవాలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.అమ్మవారి దేవాలయాన్ని పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు