క్రికెటర్ శ్రీశాంత్ ( Sreesanth )అనగానే మనకు దూకుడైన మనస్తత్వం కనిపిస్తుంది.తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ బౌలర్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఐపీఎల్ 2013లో స్పాట్ -ఫిక్సింగ్ వివాదం మొత్తం దేశాన్ని కుదిపేసింది.ఈ స్కామ్ లో నిందితుడైన పేసర్ శ్రీశాంత్ కూడా జైలుకు వెళ్ళాడు.
ఇది అతని అభిమానులకు పెద్ద షాక్.వివాదం తరువాత, వారు భారత జట్టుకు శ్రీశాంత్ ఆడాలనుకున్నా సాధ్యం కాలేదు.
ఐపీఎల్ లోకి రావాలనుకున్నా ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు.దీంతో క్రికెట్ ఆడాలనుకున్న అతడి ఆశ నెరవేరలేదు.
ఈ తరుణంలో దాదాపు పదేళ్ల తర్వాత ఐపీఎల్ లో శ్రీశాంత్ కనిపించనున్నాడు.ఆయన ఇప్పుడు కామెంటేటర్ గా మారి తోటి మాజీ క్రికెటర్లతో వ్యాఖ్యానం చేయనున్నాడు.

2022 సంవత్సరంలో, శ్రీశాంత్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.ఈ కేరళ ఫాస్ట్ బౌలర్ ఐపిఎల్ 2023లో తిరిగి వస్తున్నారు.అయితే, ఇప్పుడు అతను మైదానంలో ఆడుతూ కనిపించడు.కానీ కామెంటేటర్ గా కొత్త అవతారం ఎత్తనున్నాడు.2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో చిక్కుకున్న తరువాత, అతను క్రికెట్ ఆడలేకపోయాడు.కానీ అతను ఇతర దేశాల లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నాడు.
ఐపీఎల్( IPL ) స్పాట్ -ఫిక్సింగ్ వివాదం కారణంగా అతని కెరీర్ ముగిసింది.శ్రీశాంత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్( World Cup ) గెలిచిన భారత జట్టులో సభ్యుడు.2007లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మిస్బా ఉల్ హక్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్నాడు.

దీంతో మన జట్టు ఫైనల్ లో గెలిచి వరల్డ్ కప్ ఒడిసిపట్టింది.తరువాత భారత జట్టు ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో వన్డే ప్రపంచ కప్‌లో గెలిచింది.ఇక శ్రీశాంత్ ఐపీఎల్‌లో వివాదాలు మూటగట్టుకున్నాడు.
దీంతో 2013లో స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ లో చిక్కుకోవడంతో అతడిని బీసీసీఐ నిషేధించింది.తిరిగి న్యాయపోరాటం చేసి, విజయం సాధించినా క్రికెటర్ గా కెరీర్ మాత్రం గాడిలో పడలేదు.
