టెన్త్ క్లాస్ డైరీస్ రివ్యూ: గ్యారెంటీ.. మీ స్కూల్ డేస్ గుర్తొస్తాయ్!

గరుడవేగతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అంజి దర్శకత్వంలో రూపొందిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. ఈ సినిమాలో శ్రీరామ్, అవికా గోర్, వెన్నెల రామారావు, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, అర్చన, శివ బాలాజీ, నాజర్, సంజయ్ స్వరూప్, భాను శ్రీ తదితరులు నటించారు.

 Sreeram Avika Gor Tenth Class Diaries Movie Review And Rating Details, Tent Clas-TeluguStop.com

అచ్యుత రామారావు, పి రవితేజ మన్యం నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇక సినిమాటోగ్రఫీని, అడిషనల్ స్క్రీన్ ప్లేను అంజినే అందించాడు.

చిన్న నేపథ్య సంగీతాన్ని అందించాడు.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాక ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

ఇందులో శ్రీరామ్ సోమయాజి అనే పాత్రలో నటించాడు.ఇతడు రాజమండ్రికి చెందిన వ్యక్తి.

ఇక అమెరికాలో స్థిరపడ్డాడు.ప్రతి ఒక్క అమ్మాయి ఇతడికి పడకుండా ఉండదు.పెళ్లి చేసుకున్న భార్యకు విడాకులు ఇచ్చి.ఇతర అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఇక ఇతడికి మంచి పేరు ఉన్న కూడా ఏదో ఒక విషయంలో అసంతృప్తి చెందుతాడు.దాంతో ఒక సైకాలజిస్ట్ ను కలుస్తాడు.

అతడు సోమయాజి చెప్పిన కథ మొత్తం విని ఒక సలహా ఇస్తాడు.ఇక వెంటనే ఇండియాకి వెళ్లి టెన్త్ క్లాస్ బ్యాచ్ రీ యూనియన్ ప్లాన్ చేస్తాడు.

ఇక అక్కడికి చాందిని (అవికా గోర్) తప్ప అందరూ వస్తారు.దానితో సోమయాజి చాందిని కలవడం కోసం తన క్లాస్మేట్స్ వెన్నెల రామారావు, హిమజ, శ్రీనివాస్ రెడ్డి, అర్చన వాళ్ళతో కలిసి ఊరికి వెళ్తాడు.

కానీ అక్కడ ఆమె ఉండదు.మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది.

చివరికి అతడు ఆమెను కలుస్తాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Avika Gor, Anji, Ratind, Review, Sreeram, Telugu, Class, Tenth Class, Tol

నటినటుల నటన:

శ్రీరామ్ ఈ సినిమాల్లో తన లుక్ తో బాగా ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఎమోషనల్ సన్నివేశాలతో కూడా ఆకట్టుకున్నాడు.అవికా గోర్ మరోసారి తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.ఒక శ్రీరామ్, వెన్నెల రామారావు, హిమజ, అర్చన తదితరులు తమ పాత్రలతో మరింత మెప్పించారు.

టెక్నికల్:

ఇక టెక్నికల్ పరంగా చూస్తే పాటలు పరవాలేదు అన్నట్టుగా ఉంది.ఇక నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు.సినిమాటోగ్రఫీ, మిగతా టెక్నికల్ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.చాందిని కోసం ఎప్పుడైతే అన్వేషణ మొదలవుతుందో అప్పుడు మరింత ఆసక్తి కలిగేలా ఉంటుంది.

కానీ కథంతా అన్వేషణలో ఉండటంతో కొన్ని చిక్కులు ఎదురవుతాయి.దాంతో అక్కడ కాస్త మైనస్ గా అనిపిస్తుంది.

కొన్ని సన్నివేశాలు మాత్రం అంతగా మనసును తాకవు.

Telugu Avika Gor, Anji, Ratind, Review, Sreeram, Telugu, Class, Tenth Class, Tol

ప్లస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.నటీనటుల నటన అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.సంగీతం పర్వాలేదు.

బాటమ్ లైన్:

ఇక చివరిగా.కథ మొత్తం స్క్రీన్ మీద సరిగ్గా రాలేదని చెప్పవచ్చు.సెకండ్ ఆఫ్ కూడా ప్రేక్షకులకు పెద్ద పరీక్ష పెట్టినట్లు అనిపించింది.ఇక మంచి ఎమోషనల్ వర్క్ అవుట్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది.కానీ కొంతవరకు ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube