తన డ్రెస్సింగ్ తో షాకిచ్చిన శ్రీముఖి.. డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చావా అంటూ ట్రోల్స్?

ఈమధ్య సెలబ్రిటీలు వేసుకునే దుస్తువులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు.ఒకప్పుడు పద్ధతిగా ఉండే సెలబ్రిటీలంత గ్లామర్ షో చేయటానికి ఏమాత్రం వెనకాడకుండా బాగా రెచ్చిపోతున్నారు.

 Sreemukhi Shocked With Her Dressing Netizens Trolling Details, Srimukhi ,sreemuk-TeluguStop.com

ముఖ్యంగా తమ వస్త్రధారణ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు.రకరకాల ఫ్యాషన్ డిజైనర్లను పట్టుకొని వారు చేసిన డిజైన్లను ఫాలో అవుతున్నారు.

అయితే వారు వేసుకునే దుస్తులను చూస్తే మాత్రం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తాయి.ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మాత్రం బుల్లితెర సెలబ్రిటీలో అస్సలు ఆగట్లేదు.ఇప్పటికే యాంకర్ అరియాన, అషు రెడ్డి ఇలా చాలామంది బోల్డ్ గా తయారవుతున్నారు.మరో ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి కూడా అలాగే తయారవుతుంది.

తాజాగా తను వేసుకున్న డ్రెస్ తో మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.

అదుర్స్ షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి మరింత పేరు సంపాదించుకుంది.

తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి అభిమానాన్ని సొంతం చేసుకుంది.  ఏ షోలో అయినా బాగా యాక్టివ్ గా, ఎనర్జీగా కనిపిస్తుంది.ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది.

చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.బుల్లి తెరపై మాత్రం యధావిధిగా తన యాంకరింగ్ జీవితాన్ని కొనసాగిస్తుంది.

సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నిత్యం తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా పంచుకుంటుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

ఈ మధ్య శ్రీముఖి తన అందాలను పరిచయం చేసింది.ఎంతలా అంటే ఒకప్పుడు గ్లామర్ గా కనిపించినప్పటికీ కూడా తనువేసే డ్రస్సులలో అంతగా షో చేసినట్లు అనిపించదు.

కానీ ఇప్పుడు మాత్రం పొట్టి పొట్టి బట్టలతో.థైస్ అందాలతో, ఎద అందాలతో రెచ్చిపోతుంది.ప్రతిరోజు ఫోటోషూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలతో సోషల్ మీడియా వేదికగా మంచి స్టఫ్ పెడుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

అందులో కూడా బాగానే షో చేసింది.

అయితే ఆమె వేసుకున్న డ్రస్సు మాత్రం చాలా దారుణంగా ఉంది.

దీంతో ఆమె డ్రస్ ని చూసిన అభిమానులు ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటే మీపై గౌరవం పోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కొంతమంది ట్రోలర్స్ మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

డైరెక్ట్ బాత్రూమ్ నుండి బయటికి వచ్చాక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అంటూ ఓ నెటిజన్ బాగా ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube