Sreemukhi : వయసు పెరిగిపోతుంది.. ఒత్తిడి కూడా పెరిగింది పెళ్లిపై శ్రీముఖి కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శ్రీముఖి ( Sreemukhi ) ఒకరు బుల్లితెర రాములమ్మగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఇటీవల కాలంలో తరచూ శ్రీముఖి పెళ్లి ( Marriage ) వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

 Sreemukhi Open Up Her Marriage-TeluguStop.com

ఇక ఈమె ఏ కార్యక్రమానికి వెళ్లిన తనకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

Telugu Anchor, Sreemukhi, Tollywood-Movie

తాజాగా శ్రీముఖి తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీముఖి తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఒకవైపు వయసు పెరిగిపోతుంది.మరోవైపు పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు కూడా తనకు ఎక్కువయ్యాయని తెలియజేశారు.

ఇక పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రుల నుంచి నాకు ఒత్తిడి కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.

ప్రస్తుతం నేను నా వృత్తిపరంగా ఎంతో బిజీగా గడుపుతున్నాను.ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులు తెలియజేస్తూ నా కెరియర్ మంచిగా ముందుకు వెళుతుందని తాను తన పనులు చూసుకుంటూ మరింత మంచి సక్సెస్ అందుకోవాలని నీకు నచ్చినప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అంటూ నా తల్లితండ్రులు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు.

Telugu Anchor, Sreemukhi, Tollywood-Movie

ఇక ప్రస్తుతం నేను చాలా మంచి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నానని ఈమె తెలియజేశారు.తనకు ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలు కూడా ఏమాత్రం లేవని శ్రీముఖి వెల్లడించారు.ఇక నేను మాట్లాడితే అందరూ నన్ను లౌడ్ స్పీకర్ అని అంటూ ఉంటారు.ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి సెట్ అయిన ఆ విషయాన్ని లౌడ్ స్పీకర్ లాగే అందరికీ చెబుతాను అంటూ పెళ్లి గురించి శ్రీముఖి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube