ఐదు ప్రముఖ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఐటీ ఉద్యోగం( IT job ) సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే ఒక యువతి మాత్రం ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.

కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సులువుగా సాధించవచ్చని శ్రావణి అనే యువతి ప్రూవ్ చేశారు.శ్రావణి( Shravani ) తొలి ప్రయత్నంలో సాధించిన వేతనంతో పోలిస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం వచ్చే ఉద్యోగానికి ఎంపికయ్యారు.

బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలోని( Bomnampadu village ) వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రావణి ఎంసెట్ లో 6,000 ర్యాంక్ సాధించి పెదకాకాని మండలంలోని వీవీఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో చేరారు.బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే శ్రావణికి ఎసెన్ ట్యూర్ కంపెనీలో( Esen ture Company ) 4.5 లక్షల రూపాయల వేతనంతో జాబ్ వచ్చింది.

ఆ తర్వాత ఓడీ కంపెనీలో 5 లక్షలు( OD Company ), ఐబీఎంలో 9 లక్షలు, ఫ్లిప్ కార్ట్ లో 11 లక్షలు, వాల్ మార్ట్ లో 23 లక్షల రూపాయల వేతనంతో ఆమె జాబ్ సాధించారు.శ్రావణి తన సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తమ కాలేజ్ లో ఒక స్టూడెంట్ మూడు జాబ్స్ సాధిస్తే ఛైర్మన్ వాళ్లను సత్కరించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.

Advertisement

నా తల్లీదండ్రులకు సైతం అలాంటి సత్కారం చేయాలనే లక్ష్యం పెట్టుకుని నా లక్ష్యాన్ని సాధించానని శ్రావణి పేర్కొన్నారు.ఎక్కువ మొత్తం వేతనం ఇస్తామని చెప్పిన వాల్ మార్ట్ కంపెనీలో ఉద్యోగంలో చేరానని ఆమె చెప్పుకొచ్చారు.లక్ష్యంతో ముందుకెళ్తే అనుకున్నది సాధించడం సులువేనని ఆమె పేర్కొన్నారు.

శ్రావణి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.శ్రావణిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

శ్రావణి ఈతరం యువతలో ఎంతోమందికి రోల్ మోడల్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

సివిల్స్ సాధించి సేవాభావంతో వేలమంది ఆకలి తీరుస్తున్న ధాత్రి రెడ్డి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు